- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్ :రేవంత్ రెడ్డి
<p>దిశ, వెబ్డెస్క్: ప్రతిరోజు రాత్రి బీజేపీ, ఎంఐఎం నేతల ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తోందని.. దీనికి సంధానకర్త అమిత్ షా అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాత్రి సమయంలో బండి సంజయ్, అరవింద్, అసద్, అక్బరుద్దీన్ స్క్రిప్ట్ తయారు చేసుకోవడం… ఉదయం సురభి నాటకానికి తెర లేపుతున్నారని విమర్శించారు. పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ, ఎంఐఎంలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని రేవంత్ రెడ్డి విమర్శించారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, […]</p>

దిశ, వెబ్డెస్క్: ప్రతిరోజు రాత్రి బీజేపీ, ఎంఐఎం నేతల ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తోందని.. దీనికి సంధానకర్త అమిత్ షా అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాత్రి సమయంలో బండి సంజయ్, అరవింద్, అసద్, అక్బరుద్దీన్ స్క్రిప్ట్ తయారు చేసుకోవడం… ఉదయం సురభి నాటకానికి తెర లేపుతున్నారని విమర్శించారు.
పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ, ఎంఐఎంలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని రేవంత్ రెడ్డి విమర్శించారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ.. పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు. పీవీ, ఎన్టీఆర్ లపై నిజంగా బీజేపీకి ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా.. ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదని తెలిపారు.






