కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

by  |
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
X

దిశ, వెబ్‎డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫేస్టోను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్, పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క మంగళవారం విడుదల చేశారు. గ్రేటర్ ప్రజలకు 30వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేయనున్నట్లు వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేరుస్తామని తెలిపారు. విద్యార్ధులు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు మెట్రోలు, ఎంఎంటీఎస్‎లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పుకొచ్చారు.

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. 80 గజాలలోపు ఉన్న ఇళ్లకు పర్మిషన్, ట్యాక్స్ మినహయింపు సౌకర్యం కల్పించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. చెరువుల రక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని మేనిఫేస్టోలో పేర్కొన్నారు. వరద బాధిత కుటుంబాలకు ప్రతి ఇంటికి రూ.50 వేలు సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల సాయం అందజేస్తామనివెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఉచిత ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అమలు చేస్తామని.. ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed