డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్.. కనీసం పోటీ కాదు కదా దరిదాపుల్లో కూడా కనబడలే

by  |
Ap-Congress1
X

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ డిపాజిట్ కోల్పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రౌండ్‌లోనూ కనీసం పోటీ కాదు కదా దరిదాపుల్లో కూడా రాలేని పరిస్థితి నెలకొంది. కేవలం 6235 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇకపోతే ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ తీవ్ర ఆరోపణలు చేశారు. బద్వేలు ఉపఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఉన్నాయని అందువల్లే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జ‌ర‌గ‌నివ్వలేదని కమలమ్మ ఆరోపించారు. బాలయోగి గురుకుల పాఠశాలలోని లెక్కింపు కేంద్రానికి ఆమె వచ్చారు. అయితే గెలుపు వైసీపీ అభ్యర్థి డా. దాసరి సుధకు ఖరారైన నేపథ్యంలో ఆమె లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక నేప‌థ్యంలో వైసీపీ ప్రదర్శించిన తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జ‌రిగితే ప్రజల అభిప్రాయం ఏంటో అందరికీ తెలిసేదన్నారు. వైసీపీ మంత్రులంతా వ‌చ్చి ఇక్కడి ప్రజలను మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ నేత‌లు డ‌బ్బు, మ‌ద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. ఉప ఎన్నిక‌లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్లే వైసీపీ గెలిచిందని కమలమ్మ అన్నారు.


Next Story