- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాయంపేటలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
<p>దిశ, శాయంపేట: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 37వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె చిత్ర పటానికి గండ్ర సత్యనారాయణరావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని, బ్యాంకులను జాతీయం చేసి పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి […]</p>

దిశ, శాయంపేట: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 37వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె చిత్ర పటానికి గండ్ర సత్యనారాయణరావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని, బ్యాంకులను జాతీయం చేసి పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశయాలను కొనసాగించి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి, చింతల భాస్కర్, మారేపల్లి బుజ్జన్న, చిందం రవి, రఫీ, దుబాసి కృష్ణమూర్తి, మార్కండేయ, నిమ్మల రమేష్, రాజ్ కుమార్, పత్తి శీను,మస్కికుమార్ రాజు, రవి పాల్, రఘు తదితరులు పాల్గొన్నారు.






