- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామలింగారెడ్డి మృతికి కాంగ్రెస్ నేతల సంతాపం
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగుసార్లు సహచర ఎమ్యెల్యేగా పని చేసిన రామలింగారెడ్డికి ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన ఉందన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఉన్న నాయకుడని కొనియాడారు. ప్రజా ఉద్యమ నేతగా, జర్నలిస్టుగా, ఎమ్యెల్యేగా చాలా […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగుసార్లు సహచర ఎమ్యెల్యేగా పని చేసిన రామలింగారెడ్డికి ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన ఉందన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఉన్న నాయకుడని కొనియాడారు. ప్రజా ఉద్యమ నేతగా, జర్నలిస్టుగా, ఎమ్యెల్యేగా చాలా చురుకైన పాత్ర పోషించిన నాయకుడని, ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రామలింగారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని వారు పేర్కొన్నారు.
Next Story






