60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత

by Shamantha N |

<p>దిశ, వెబ్ డెస్క్: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ 60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన రవీనా ఖురానాను ఆయన మనువాడారు. ఆదివారం(ఈ నెల 8న) ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో నిరాడంబరంగా జరిగిన వీరి వివాహ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ముకుల్ ఇప్పటి వరకూ [&hellip;]</p>

60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ 60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన రవీనా ఖురానాను ఆయన మనువాడారు. ఆదివారం(ఈ నెల 8న) ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో నిరాడంబరంగా జరిగిన వీరి వివాహ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ముకుల్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. రవీనా న్యాయవాదిగా, వ్యాపారవేత్తగానూ కొనసాగుతున్నారు.


Tags: mukul wasnik marriage, wedding, congress leader, ashok gehlot,

Next Story