మాకే కరోనా అంటించేందుకు సీఎం కుట్ర

by  |
మాకే కరోనా అంటించేందుకు సీఎం కుట్ర
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. కాగా కరోనా నివారణపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రశ్నించిన వారికి కరోనా రావాలని శపించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. విపక్షాలకు సీఎం కేసీఆర్ కరోనా వైరస్‌ను అంటించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పెద్ద రాజకీయ కుట్రదారని, ఆయన ఏ స్థాయికయినా దిగజారుతారన్నారు. అంతేకాదు సీఎంను విమర్శించే వాళ్ళను అరెస్టు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న ప్రతీ పక్షాలపై ఇలాంటి చర్యలు చేయడం సరికాదన్నారు.

పోలీస్ స్టేషన్లో, పోలీస్ వాహనాలలో శానీటైజ్ చేయడం లేదన్నారు. పోలీసులు అరెస్టు చేసే ముందు వాహనాలను శుభ్రపరిచి అందులో తీసుకెళ్లాలన్నారు. పోలీస్ వాహనాల ద్వారా మా నాయకులకు ఎవరికైనా వైరస్ సోకితే సీఎం కేసీఆర్, డీజీపీలదే బాధ్యత అని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed