- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. విద్యార్థి సంఘం నేతల మధ్య వాగ్వాదం.. నేతపై భౌతిక దాడి
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని : ఓ పార్టీ కార్యాలయంలో కొంత మంది విద్యార్థి సంఘం నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఓ మాజీ విద్యార్థి సంఘం నేత పార్టీకి ఫండ్ ఇవ్వాలని వెళ్లగా సదరు పాఠశాల యాజమాన్యం స్థానికంగా ఉండే మరో విద్యార్థి సంఘం నేతకు సమాచారాన్ని అందించారు. దీంతో అక్కడికి వెళ్ళిన విద్యార్థి సంఘం నేత సదరు మాజీ నాయకుడిని నిలదీయడంతో వారి మధ్య మాటలు […]</p>

X
దిశ, గోదావరిఖని : ఓ పార్టీ కార్యాలయంలో కొంత మంది విద్యార్థి సంఘం నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఓ మాజీ విద్యార్థి సంఘం నేత పార్టీకి ఫండ్ ఇవ్వాలని వెళ్లగా సదరు పాఠశాల యాజమాన్యం స్థానికంగా ఉండే మరో విద్యార్థి సంఘం నేతకు సమాచారాన్ని అందించారు.
దీంతో అక్కడికి వెళ్ళిన విద్యార్థి సంఘం నేత సదరు మాజీ నాయకుడిని నిలదీయడంతో వారి మధ్య మాటలు పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇదే విషయంపై మాట్లాడటానికి సదరు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ మాట్లాడుకుంటున్న క్రమంలో వారి మధ్య మళ్లీ మాటల యుద్ధం పెరిగింది. దీంతో సదరు మాజీ నాయకుడు బైరిమల్ల రాజ్ కుమార్ అనే నాయకుడిపై దాడి చేయడంతో చెవులో నుండి రక్తం కారడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






