- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గెజిటెడ్ సంతకం కోసం.. నర్సుల తిప్పలు
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే మూడేళ్ల ఆలస్యంతో ఆవేదనలో ఉన్న నర్సింగ్ అభ్యర్థులకు ఇప్పుడు మరో కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో కూడిన నకలు పత్రాలను కూడా తీసుకురావాల్సిందిగా కమిషన్ సూచించింది. దీంతో డాక్టర్ల సంతకం, సీల్ కోసం నర్సులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న గ్రేడ్-1, గ్రేడ్-2 నర్సులు గెజిటెడ్ హోదా […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే మూడేళ్ల ఆలస్యంతో ఆవేదనలో ఉన్న నర్సింగ్ అభ్యర్థులకు ఇప్పుడు మరో కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో కూడిన నకలు పత్రాలను కూడా తీసుకురావాల్సిందిగా కమిషన్ సూచించింది. దీంతో డాక్టర్ల సంతకం, సీల్ కోసం నర్సులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న గ్రేడ్-1, గ్రేడ్-2 నర్సులు గెజిటెడ్ హోదా కలిగినవారైనప్పటికీ చాలా మందికి ఆ విషయం తెలియక సర్జన్లు, ప్రభుత్వ అధికారుల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. డ్యూటీ చేసుకుంటూనే సంతకం కోసం గంటల సమయాన్ని వెచ్చించడం భారం మారింది.
2018లో నోటిఫికేషన్
ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్ లో 3,311 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాతపరీక్షలను కూడా నిర్వహించింది. కోర్టు వివాదాలతో గతేడాది సెప్టెంబరులో మార్గం సుగమమైంది. తుది జాబితా తయారీ సందర్భంగా, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు వెయిటేజీ మార్కులు వేయడంలో జరిగిన పొరపాటుతో నాలుగైదు నెలల సమయం పట్టింది. చివరకు జాబితా తయారైన తర్వాత 3142 మంది మాత్రమే అర్హత సాధించారు. ఇంకా పోస్టులు ఖాళీగానే మిగిలిపోతున్నాయి.
ఆ నిబంధనను అమలు చేయాలి
ఇదంతా ఒక ఎత్తయితే గెజిటెడ్ అధికారి సంతకం కోసం నర్సులకు ఎక్కువ సమయం పడుతుండడం ఇబ్బందికరంగా పరిణమించింది. గ్రేడ్-1, గ్రేడ్-2 స్టాఫ్ నర్సులకు గెజిటెడ్ హోదా ఉంటుందని నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నిబంధన ప్రకారం గ్రేడ్-1, గ్రేడ్-2 నర్సుల సంతకాలను గెజిటెడ్ ధ్రువీకరణగా గుర్తించాలని ఆ ప్రతినిధి విజ్ఞప్తి చేశారు.






