అక్కడ మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్..

by  |
అక్కడ మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా కరోనా నివారణకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. టెస్టు, ట్రేస్, ట్రీట్, వ్యాక్సినేషన్, కరోనా రూల్స్ పేరిట ఐదు మార్గాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టాలని ఆదేశించింది. ఉన్నట్టుండి దేశంలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రాష్ట్రప్రభుత్వాలు ముందస్తు చర్యలు రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి.

ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ వంటి రాత్రివేళ ప్రజలెవరూ బయటకు రాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ముంబైలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో శని, ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించింది శివసేన సర్కార్. ప్రస్తుతం మహారాష్ట్ర బాటలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో ఈనెల 9 నుంచి 19వ తేదీవరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నట్లు ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఎవరూ నిర్భంధం సమయంలో బయటకు రాకూడదని, అత్యవసరమైతేనే రావాలని ఆ సమయంలో కొవిడ్ రూల్స్ పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌‌ విధించండి


Next Story