- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఇద్దరిపై డీజీపీకి ఫిర్యాదు
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: నార్త్‌జోన్ డీసీపీ, తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. తిరుమలగిరిలో జేజే ఎంటర్ ప్రైజెస్, విన్నీ ఎంటర్ ప్రైజెస్ సంస్థల్లో వెంకట్వేశ్వరరావు 16ఏళ్లు పనిచేసి రెండేళ్ల క్రితం మానేశాడు. జేవీ కృష్ణారెడ్డి వద్ద ఉద్యోగం మానేసిన వెంకటేశ్వరరావు అదే వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో తనను రూ.3.50కోట్లకు మోసం చేసినట్టుగా వెంకటేశ్వరరావుపై జేవీ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే కేసు విచారణకు […]</p>

దిశ, క్రైమ్‌బ్యూరో: నార్త్‌జోన్ డీసీపీ, తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. తిరుమలగిరిలో జేజే ఎంటర్ ప్రైజెస్, విన్నీ ఎంటర్ ప్రైజెస్ సంస్థల్లో వెంకట్వేశ్వరరావు 16ఏళ్లు పనిచేసి రెండేళ్ల క్రితం మానేశాడు. జేవీ కృష్ణారెడ్డి వద్ద ఉద్యోగం మానేసిన వెంకటేశ్వరరావు అదే వ్యాపారాన్ని ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో తనను రూ.3.50కోట్లకు మోసం చేసినట్టుగా వెంకటేశ్వరరావుపై జేవీ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే కేసు విచారణకు సహకరించినా నన్ను, నా కుటుంబ సభ్యులను నార్త్‌జోన్ డీసీపీ పేరుతో ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తరుచూ బెదిరిస్తున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డికి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. బెయిల్ తెచ్చుకున్నా పోలీసులు మా ఇంటిలో సోదాలు నిర్వహించి భయానికి గురిచేస్తున్నారని వెల్లడించాడు. ఈ విషయంపై తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం వెంకటేశ్వరరావు పరారీలో ఉంటూ తప్పుుడు ప్రచారం చేస్తున్నాడని తెలిపారు.






