మంత్రి కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

6

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై నేరెడ్‌మెట్ పోలీసులకు సుమేధ తల్లిదండ్రులు సోమవారం ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ కూతురు సుమేధ మృతికి కారణమైన అందరిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేయాలని కోరారు. మూడ్రోజుల క్రితం నేరెడ్‌మెట్‌‌లో సైకిల్‌పై వెళ్తూ నాలాలో పడి సుమేధ అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే.