జడ్జీలపై అటువంటి వ్యాఖ్యలు సరికాదు: రవిశంకర్ ప్రసాద్

by  |

పాట్నా: న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని, కొందరు లీగల్ యాక్టివిస్టులు తమకు అనుకూలంగా తీర్పులు వెలువడకుంటే ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఒక తీర్పు హేతుబద్ధతను విమర్శించవచ్చునని, కానీ, ఇటీవల ఒక అభ్యంతరకర ధోరణి మొదలైందని తెలిపారు. కొందరు లీగల్ యాక్టివిస్టులు దాఖలు చేసే పిల్, పిటిషన్లపై సానుకూల ఆదేశాలు వెలువడకుంటే సోషల్ మీడియాలో న్యాయమూర్తులపైనే ట్రోలింగ్‌ చేస్తున్నారని, వారికి వ్యతిరేకంగా ఎజెండా సెట్ చేస్తున్నారని చెప్పారు. ఇది ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. పాట్నా హైకోర్టు నూతన భవంతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రవిశంకర్ శనివారం మాట్లాడారు. ‘మేం స్వేచ్ఛకు అనుకూలం. విమర్శలకూ తలుపులు తెరిచే ఉంచాం. అసమ్మతినీ ఆమోదిస్తాం. కానీ, సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడమే అసలు సమస్య. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది’ అని అన్నారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed