గుండెపోటుతో ఐసీయూలో పాపులర్ కమెడియన్‌

by  |
గుండెపోటుతో ఐసీయూలో పాపులర్ కమెడియన్‌
X

దిశ, సినిమా :పాపులర్ తమిళ కమెడియన్ వివేక్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చెన్నైలోని సిమ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అతని హెల్త్ కండిషన్ సీరియస్‌గానే ఉందని, కొద్ది గంటలు గడిస్తేనే ఏ విషయమైనా చెప్పగలమని తెలిపారు వైద్యులు. ఐసీయూలో ఉన్న వివేక్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. కాగా వివేక్‌కు స్ట్రోక్ రావడం ఇది రెండోసారి. గురువారం ఓమందూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కరోనా మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వివేక్‌కు ఇదేమైనా ఎఫెక్ట్ పడిందా అని అనుమానిస్తున్నారు ఫ్యాన్స్. వివేక్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

Next Story

Most Viewed