- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యవసర సేవలకు… కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మరో రెండ్రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో వికారాబాద్ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా అధికారులను, మండల స్థాయి అధికారులను, గ్రామ కార్యదర్శులను తమ స్థానంలో ఉండాలని ఆదేశించామని కలెక్టర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలు పని […]</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మరో రెండ్రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో వికారాబాద్ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే జిల్లా అధికారులను, మండల స్థాయి అధికారులను, గ్రామ కార్యదర్శులను తమ స్థానంలో ఉండాలని ఆదేశించామని కలెక్టర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలు పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల కోసం కంట్రోల్ రూమ్ నెం. 6305954956 ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎమర్జెన్సీ సేవలకు ప్రజలు పై నెంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందాలని కలెక్టర్ సూచించారు.
Next Story






