ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి: కలెక్టర్

by  |
ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి: కలెక్టర్
X

దిశ, వరంగల్: ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జనగామ మండలంలోని గానుగుపహాడ్ గ్రామాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని చెక్‎డ్యామ్ రిపేరు పనులు, పల్లె ప్రగతి పనులతో పాటు అన్ని గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా ఎవరి ఇంటి ముందు వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Next Story

Most Viewed