- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు పితృవియోగం
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి.భాస్కర్ మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం బారిన పడిన ఆయన గత కొన్నిరోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. అయినా కూడా ఫలితం లేకపోయింది. ఇదిలాఉండగా వి.భాస్కర్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన […]</p>

X
దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి.భాస్కర్ మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
అనారోగ్యం బారిన పడిన ఆయన గత కొన్నిరోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. అయినా కూడా ఫలితం లేకపోయింది. ఇదిలాఉండగా వి.భాస్కర్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శిగా సేవలందించారు. సిరిసిల్ల కలెక్టర్ తండ్రి మృతి పట్ల ఐటీ మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






