ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లిని అభినందించాలి.. ఎందుకంటే?

by  |
Collector abhilasha
X

దిశ, మహబూబాబాద్: ఆడపిల్ల జన్మిస్తే అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రసవాలను పెంచేందుకు పలు వినూత్న పద్ధతులు, వైద్య శాఖ కార్యకలాపాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆడ పిల్లలు పుడితే ప్రాధాన్యత చూపాలని ప్రసవించిన మహిళకు స్వీట్స్ ప్యాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలపాలన్నారు. ఆడపిల్లల ప్రాధాన్యత వివరించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన మహిళల గురించి తెలుపుతూ వారి చిత్రాలను స్వీట్ ప్యాకెట్స్‌పై ముద్రించి అందజేయాలన్నారు. కేసీఆర్ కిట్ ఆడపిల్లలకు ప్రాధాన్యత ఇచ్చిందని, అదేవిధంగా ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులను అభినందించాలన్నారు.

గర్భిణీ ప్రసవించే ముందుగా సైక్రియాటిస్ట్‌తో ఆడపిల్ల పుట్టుక విశిష్టత తెలియజేయాలని, అదేవిధంగా వారి బంధువులకు కూడా వివరించి చెప్పాలన్నారు. ఈనెల 26వ తేదీన పుట్టిన ఆడపిల్లలకు స్వీట్ బాక్స్ అందించే కార్యక్రమ వేడుకను పండుగలా చేపట్టాలన్నారు. ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు బానోతు వెంకటరాములు ఉప వైద్యాధికారి అంబరీష పాల్గొన్నారు.


Next Story

Most Viewed