ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుతాం : సీఎం ఉద్ధవ్ ఠాక్రే

by  |
ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుతాం : సీఎం ఉద్ధవ్ ఠాక్రే
X

ముంబయి: కర్ణాటకలో మెజార్టీ ప్రజలు మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుతామని, అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తెలిపారు. బొంబాయ్ ప్రెసిడెన్సీ కాలంలో బొంబాయ్‌లో కిలిసి ఉన్న బెల్గామ్, ఇతర ప్రాంతాలను భాషా ప్రాతిపదికన మహారాష్ట్ర వాదిస్తున్నది. బెల్గామ్‌తో పాటు సరిహద్దులోని మరికొన్ని ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపాలని మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి పోరాటం చేస్తున్నది. ఈ పోరాటంలో మరణించినవారిని స్మరిస్తూ జనవరి 17వ తేదీని అమరవీరుల దినంగా జరుపుకుంటున్నది. మరాఠీ మాట్లాడే ప్రజలు మెజార్టీగా ఉన్న ప్రాంతాలను మహారాష్ట్రలో చేర్చడమే ఆ అమరులకు ఇచ్చే నిజమైన నివాళి అని మహారాష్ట్ర సీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఈ హామీతో అమరులను స్మరిస్తున్నట్టు తెలిపింది.


Next Story