శ్రీరంగంలో సీఎం కేసీఆర్ కుటుంబం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు

by Shyam |   (  Updated:2021-12-13 06:37:30  IST  )

<p>దిశ, డైనమిక్ బ్యూరో : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం ఆలయాన్ని సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరుచ్చికి వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీరంగానికి వెళ్లి రంగనాథస్వామిని చేరుకోగా.. జిల్లా కలెక్టర్‌తో పాటు ఆలయ అధికారులు స్వాగతం పలకగా.. ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెన్నైకి వెళ్లారు. అయితే, మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య తమిళనాడు సీఎం [&hellip;]</p>

CM Kcr
X

దిశ, డైనమిక్ బ్యూరో : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం ఆలయాన్ని సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరుచ్చికి వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీరంగానికి వెళ్లి రంగనాథస్వామిని చేరుకోగా.. జిల్లా కలెక్టర్‌తో పాటు ఆలయ అధికారులు స్వాగతం పలకగా.. ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెన్నైకి వెళ్లారు. అయితే, మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆలయానికి వచ్చిన వారిలో మంత్రి కేటీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.

CM KCR worships

Next Story