గుణాత్మక మార్పు రావాలి: కేసీఆర్

17

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యానవన శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కూరగాయాలు, పండ్లు, పూల తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారని.. ఈ సానుకూలతలను వినియోగించుకోవాలన్నారు. సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉద్యానవన పంటల సాగులోనూ దేశంలో అగ్రస్థానంలో నిలవాలని.. రాష్ట్ర సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.