కేసీఆర్ మంచి మనసు.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి ఆర్థికసాయం

by  |
కేసీఆర్ మంచి మనసు.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి ఆర్థికసాయం
X

దిశ,వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ విద్యార్థినికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధితురాలు తండ్రి బాల్ రెడ్డి కి 25 లక్షల రూపాయల విలువ గల చెక్కును అందజేసారు. వనపర్తి జిల్లా రేవల్లి గ్రామానికి చెందిన బాల్ రెడ్డి కూతురు శివాని(23) పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది.

హైదరాబాద్ లోని ఫిర్జాదిగూడలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా కుటుంబంను పోషిస్తున్న శివారెడ్డి, తన కుమార్తె శివాని ఎంబీబీఎస్ లో సీటు వచ్చినా చదువుకోలేని పరిస్థితని, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని మంత్రి దృష్టి కి తీసుకువెళ్లగా, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి బాధితురాలికి వైద్య చికిత్స నిమిత్తం రూ. 25లక్షల రూపాయల చెక్కును మంజూరు చేయించారు.పెద్దమనస్సుతో వారికి చేసిన సహాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి లకు శివాని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed