హుజురాబాద్ ప్రజలకు కేసీఆర్ మరో బంపర్ ఆఫర్.. వారం రోజుల్లోనే!

by  |
Huzurabad
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్​ నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురుస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు తాళం వేసిన వెబ్​సైట్‌ను అక్కడి ఓటర్ల కోసం ఓపెన్​చేశారు. రేషన్​కార్డు దరఖాస్తు చేసుకునేందుకు లింక్‌ను ఓపెన్​చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రాష్ట్రమంతా ఈ లింక్​ఓపెన్​ అయినా.. కొత్త కార్డులను మాత్రం ఇచ్చేది కేవలం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకే. అంతేకానీ రాష్ట్రలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇప్పడేమీ ఇవ్వరు. హుజురాబాద్ ప్రాంత ప్రజలకు మాత్రం దరఖాస్తు చేసుకున్న వారంలోగా కార్డులు ఇస్తామని అధికారులు చెప్పుతున్నారు. దీనిపై గ్రామాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టారు.

రాష్ట్రంలో ఇటీవలే కొత్త రేషన్​కార్డులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే, 2018 కంటే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కార్డులు జారీ అయ్యాయి. ఆ తర్వాత అప్లై చేసుకున్న దాదాపు 4.60 లక్షల మందికి ఇవ్వలేదు. దీంతో ఇవన్నీ పెండింగ్‌లో పెట్టారు. కాగా, హుజురాబాద్​ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో అక్కడి ప్రజల కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రేషన్​కార్డుల దరఖాస్తు చేసుకునేందుకు శనివారం రాత్రి నుంచి సైట్ ఓపెన్ చేశారు. అయితే, దీనిపై హుజురాబాద్ సెగ్మెంట్‌లో అధికారులతో ప్రకటనలు విడుదల చేయించారు. రేషన్​కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు సైట్​ఓపెన్​అయిందని, కార్డు లేనివారు, కొత్తగా వివాహం అయినవారు, పిల్లలున్న వారి పేర్లను చేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెబ్‌సైట్​లింక్​ ఓపెన్​చేశారు. కానీ కొత్త కార్డుల జారీ మాత్రం కేవలం హుజురాబాద్​నియోజకవర్గానికి పరిమితం చేస్తున్నట్లు అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్పుతున్నారు.

అప్పుడు బంద్..

గత ఏడేండ్లుగా రేషన్​కార్డుల కోసం పేదలు దరఖాస్తు చేసుకున్నా పెండింగ్​పెట్టారు. వాస్తవానికి జూన్‌లో జరిగిన కేబినెట్ భేటీలో కొత్తకార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే 5,63,411 రేషన్ కార్డుల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 5 లక్షలకు మంది కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. కానీ ఇటీవల పంపిణీ చేసిన కార్డులు కేవలం 3 లక్షలు మాత్రమే. అయితే, గత నెలలో రేషన్ కార్డులకు కేబినెట్​ఓకే చెప్పడంతో అర్హులైన వాళ్లంతా దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ సెంటర్ల చుట్టూ తిరిగారు. కానీ కొత్త అప్లికేషన్ల కోసం వెబ్‌సైట్‌లో ఆప్షన్ తొలగించారు. పోర్టల్‌లో ‘‘అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ప్రజెంట్’’ అని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం శనివారం రాత్రి నుంచి వెబ్‌సైట్‌ను ఓపెన్​ చేశారు. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సైట్ ఓపెన్​అయింది. అయితే రాష్ట్రంలో మళ్లీ లక్షల దరఖాస్తులు వచ్చినా.. కార్డుల మంజూరు మాత్రం కేవలం హుజురాబాద్‌కే పరిమితం చేయనున్నారు.


Next Story

Most Viewed