- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్షేమ పథకాల అమలే తొలి ప్రాధాన్యత
by Shyam |
<p> ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలను అమలు చేయడమే జిల్లా అధికార యంత్రాంగం ప్రథమ ప్రాధాన్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ అధికారికి వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత అధికార […]</p>

X
ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలను అమలు చేయడమే జిల్లా అధికార యంత్రాంగం ప్రథమ ప్రాధాన్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ అధికారికి వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుందన్నారు. విస్తృతమైన చర్చల అనంతరమే ప్రభుత్వం చట్టాలను చేస్తుందని కేసీఆర్ అన్నారు. ఈ సదస్సుకు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.
Next Story






