ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో జగన్‌‌వి కపట నాటకాలు: పోతిన వెంకట మహేశ్

by  |
ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో జగన్‌‌వి కపట నాటకాలు: పోతిన వెంకట మహేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాటం ఆడుతోందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ పాఠశాలలను మూసి వేయడం తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వేల కోట్లు విలువ చేసే ఆస్తులను దోచుకునేందుకే ఎయిడెడ్ పాఠశాలలను స్వాధీనం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పేద, మధ్య తరగతి ప్రజలు కార్పొరేట్ స్కూల్స్‌లో ఫీజులు చెల్లించగలరా అని ప్రశ్నించారు. పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయడం దుర్మార్గమన్నారు. జగన్ కపట నాటకాలు ప్రజలు అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.

అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, లాఠీఛార్జి చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా అవినీతి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం స్పందించరని సెటైర్లు వేశారు. దేవుని ఆస్తులను దోచుకోవడం, దాచుకోవడమే ఆయనకు తెలుసునన్నారు. సీఎం స్పందించి ఎయిడెడ్ నిర్ణయాన్ని మార్చుకోవాలి…లేకుంటే లక్షలాది మంది‌ విద్యార్థులు తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడించే రోజు వస్తుందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ ఆరోపించారు.

Next Story

Most Viewed