- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలి : బైరెడ్డి
<p>కర్నూలు: కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు పారాసెటిమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో స్థానిక ఎన్నికలు జరపకూడదని ఎన్నికల సంఘానికి రెండ్రోజుల తాను ఫిర్యాదు చేశానని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను బైరెడ్డి ప్రశంసించారు. జగన్ తానే ఒక శాస్త్రవేత్త అనుకుని మాట్లాడుతున్నాడని.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కరోనా […]</p>

కర్నూలు: కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు పారాసెటిమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో స్థానిక ఎన్నికలు జరపకూడదని ఎన్నికల సంఘానికి రెండ్రోజుల తాను ఫిర్యాదు చేశానని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను బైరెడ్డి ప్రశంసించారు. జగన్ తానే ఒక శాస్త్రవేత్త అనుకుని మాట్లాడుతున్నాడని.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కరోనా వైరస్‌పై సీఎం జగన్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాల క్లిప్పింగ్స్‌ను రాష్ట్రపతి, గవర్నర్, డబ్ల్యూహెచ్‌వో, నేషనల్ హ్యూమన్ రైట్స్, విదేశీ ఆరోగ్య సంస్థలకు పంపిస్తానని ఆయన తెలిపారు. ప్రజలు చచ్చినా పర్లేదు కానీ, తాను రాజకీయ లబ్ధి పొందాలని జగన్ భావిస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు.
tags : CM jagan, Nobel Prize, carona virus, byreddy rajasekhar reddy, Scientist, press meet






