గవర్నర్ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

68

దిశ, వెబ్‌డెస్క్: పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారరం ఉదయం గవర్నర్‌కు సీఎం జగన్ పుష్పగుచ్ఛం ఇచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని బండారు దత్తాత్రేయ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గవర్నర్ అయిన తర్వాత దత్తాత్రేయ మొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు.