- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారులకు 9 రకాల వ్యాక్సిన్ లు.. సిద్దం చేసిన ఏపీ ప్రభుత్వం
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో నెలల చిన్నారికి వైద్యారోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్ వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు పీసీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చిన్నారులకు 9 రకాల వ్యాక్సిన్‌లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అందిస్తోంది. తాజాగా ఇస్తున్న న్యుమోకోకల్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో నెలల చిన్నారికి వైద్యారోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్ వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు పీసీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చిన్నారులకు 9 రకాల వ్యాక్సిన్‌లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అందిస్తోంది. తాజాగా ఇస్తున్న న్యుమోకోకల్ వ్యాక్సిన్‌తో కలిపి మెుత్తం పది రకాల వ్యాక్సిన్‌లు చిన్నారులకు ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story






