మహిళల భద్రతకు 'అభయం' :సీఎం జగన్

by  |
మహిళల భద్రతకు అభయం :సీఎం జగన్
X

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల కోసం ‘అభయం’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం వర్చువల్ విధానంలో అభయం యాప్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రతే లక్ష్యంగా ‘అభయం’ యాప్ ను రూపొందించినట్లు స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన నిర్భయ స్కీమ్ లో భాగంగా అభయం ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులకు మరింత ధైర్యం ఇచ్చేందుకు అభయం దోహదపడుతుందని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రయాణ వాహనాల్లో అభయం యాప్‌ పరికరాన్ని అమర్చనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 5వేల వాహనాలకు, జూలై 1 నాటికి 50వేల వాహనాలకు, నవంబరు నాటికి లక్ష వాహనాలకు అభయం యాప్‌ను విస్తరిస్తామని చెప్పారు. ప్రయాణంలో మహిళలకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే పానిక్‌ బటన్‌ నొక్కితే పోలీసులకు సమాచారం అందతుందని వివరించారు.


Next Story

Most Viewed