బాక్సర్ లవ్లీనాకు సీఎం జగన్ అభినందనలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆమె పతకం సాధించేందుకు పోరాడిన తీరు అద్భుతమని ట్విటర్ వేదికగా తెలిపారు. ఇలాగే అద్భుతంగా ఆడుతూ యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఇకపోత బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో లవ్లీనా, టర్కీ బాక్సర్‌ బుసేనాజ్‌ చేతిలో ఓటమిచెందింది. అయితే క్వార్టర్‌ ఫైనల్‌లో చిన్‌చెన్‌పై విజయం [&hellip;]</p>

CM Jagan, boxer Lovlina
X

దిశ, ఏపీ బ్యూరో: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆమె పతకం సాధించేందుకు పోరాడిన తీరు అద్భుతమని ట్విటర్ వేదికగా తెలిపారు. ఇలాగే అద్భుతంగా ఆడుతూ యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

ఇకపోత బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో లవ్లీనా, టర్కీ బాక్సర్‌ బుసేనాజ్‌ చేతిలో ఓటమిచెందింది. అయితే క్వార్టర్‌ ఫైనల్‌లో చిన్‌చెన్‌పై విజయం సాధించి ఆమె కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు. దీంతో లవ్లీనా బోర్గోహెయిన్‌కు సోషల్ మీడియా వేదికగా భారతీయులు అభినందనలు తెలిపారు.

Next Story