ఎన్నికలకు సిద్ధం.. వ్యాక్సిన్ ఇవ్వకపోతే కేసులు పెరిగే చాన్స్ : జగన్

94
cm jagan

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశమైంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై చర్చ అనంతరం.. వాటి నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ సంకేతమిచ్చారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో త్వరగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని, లేనియెడల కేసులు పెరిగే చాన్స్ ఉందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎంకు పలువురు మంత్రులు అభినందనలు తెలిపారు. లోకల్ వార్‌లో ఎప్పుడూ లేనంతగా 80 శాతం ఫలితాలు సాధించడం మంచి విషయమని ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ సమావేశంలో భాగంగా వ్యాఖ్యానించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..