ఫేక్ కరోనా వ్యాక్సిన్ కలకలం : 70 వేలమందికి 3 డోసుల వ్యాక్సిన్లు

by  |
ఫేక్ కరోనా వ్యాక్సిన్ కలకలం : 70 వేలమందికి 3 డోసుల వ్యాక్సిన్లు
X

దిశ,వెబ్‌డెస్క్:కరోనా వ్యాక్సినేషన్ ముసుగులో ఘరానా మోసం జరిగింది. ఉత్తర అమెరికా ఈక్వెడార్ లోని క్విటోకు చెందిన డాక్టర్ లూసియా పెనాఫీల్ ఆధ్వర్యంలో 70వేల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే డాక్టర్ వ్యాక్సిన్ వేసే తీరుపై పోలీసులకు అనుమానం రావడంతో ఆస్పత్రి పై స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌తో డాక్టర్ లూసియా ఫేక్ కరోనా వ్యాక్సిన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారి సీజర్ డియాజ్ మాట్లాడుతూ 70,000 మంది ఫేక్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. మూడు మోతాదుల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా నుంచి సురక్షితంగా ఉండేలా ఇమ్యూనిటీ పవర్ పొందుతారని డాక్టర్ లూసియా బాధితులకు చెప్పినట్లు తెలిపారు. ఇక మూడు డోసుల్లో ఒక్కో కరోనా వ్యాక్సిన్ కు 15డాలర్లు వసూలు చేసినట్లు నిర్ధారించారు. అయితే బాధితులకు ఏ వ్యాక్సిన్ ఇచ్చారో ఆరోగ్యశాఖ అధికారులకు తెలియదని డియాజ్ అన్నారు.

మరోవైపు డాక్టర్ లూసియా పెనాఫీల్ బాధితులకు ఏ వ్యాక్సిన్ ఇచ్చారో చెప్పేందుకు ఇష్టపడడం లేదు. పైగా తాను ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇచ్చిన వారిలో 20వేల మంది కరోనా బాధితులున్నట్లు గుర్తు చేశారు. నేను ట్రీట్మెంట్ చేసిన వారిలో పోలీసులు, ఆరోగ్యశాఖకు చెందిన అధికారులున్నారు. ఇప్పుడు వారందరి ఆరోగ్యం బాగుందన్నారు. స్థానిక వాసులు సైతం పెనాఫీల్‌ను సమర్ధిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి తమ ప్రాణాల్ని కాపాడిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed