కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..

by  |
కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..
X

దిశ, ఏపీ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద జస్టిస్ వెంకటరమణ దంపతులకు రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్వాగతం పలికారు. జస్టిస్ వెంకటరమణ దంపతులను ఆలయ మర్యాదలతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆలయ ఈఓ భ్రమరాంబ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు వెంకటరమణ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని , తీర్ధప్రసాదాలను అందజేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంట ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ , తెలంగాణా హైకోర్టు జడ్జి లలిత కన్నెగంటి, ఏపీ, తెలంగాణ హైకోర్ట్ రిజిస్ట్రార్లు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణిమోహన్, కమిషనర్ హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed