ప్రముఖ సింగర్ మరణం.. కదిలొచ్చిన రాష్ట్రం.. అంతిమ యాత్రలో కిలోమీటర్ల మేర జనం (వీడియో)

by Sujitha Rachapalli |

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణం అస్సాం రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. బరువైన హృదయాలతో ఆ సంగీతకారుడికి వీడ్కోలు పలికారు జనాలు. ఇందుకోసం లక్షల మంది తరలిరాగా గుహవాటి వీధులన్నీ జనసంద్రంగా మారాయి.

ప్రముఖ సింగర్ మరణం.. కదిలొచ్చిన రాష్ట్రం.. అంతిమ యాత్రలో కిలోమీటర్ల మేర జనం (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణం అస్సాం రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. బరువైన హృదయాలతో ఆ సంగీతకారుడికి వీడ్కోలు పలికారు జనాలు. ఇందుకోసం లక్షల మంది తరలిరాగా గుహవాటి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. సరుసాజై స్టేడియంలో పార్థివదేహాన్ని ఉంచగా.. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు క్యూలో నిలబడి నివాళులు అర్పించారు. ఆ తర్వాత సొంత గ్రామం కామ్రాకుచిలో అంత్యక్రియలు నిర్వహించగా.. అంతిమ యాత్రలో కిలోమీటర్ల మేర జనం తరలివచ్చారు. తుది వీడ్కోలు పలికారు.

కాగా సింగపూర్‌‌లో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు వెళ్లిన ఆయన.. స్కూబా డైవింగ్ సమయంలో జరిగిన దుర్ఘటనలో కన్నుమూశాడు. అభిమానులకు తన మరణంపై స్పష్టత కోసం అస్సాం ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అధికారిక కార్యక్రమాలు, ఉత్సవాలను రద్దు చేస్తూ మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఇక జుబీన్ గార్గ్.. 1972లో నవంబర్ 18న మేఘాలయలో అస్సామీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

Next Story