అందరినీ ఆకట్టుకునే ‘జిన్’

by Sujitha Rachapalli |

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌లపై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించిన సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత ముఖ్య

అందరినీ ఆకట్టుకునే ‘జిన్’
X

దిశ, సినిమా : సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌లపై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించిన సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత ముఖ్య పాత్రల్ని పోషిస్తుండగా.. డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో నిర్మాత నిఖిల్ ఎం గౌడ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ‘మాది బెంగళూరు. నాకు చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తుండేవాడిని. మూవీస్ మీదున్న ఇంట్రెస్ట్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. నటించాలనే కోరికతో వచ్చి నిర్మాతగా మారాను. నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ద్వారా చిన్మయ్ రామ్ పరిచయం అయ్యారు. నాకు సినిమాల మీదున్న ప్యాషన్, ఇష్టం తెలుసుకుని చిన్మయ్ రామ్ ఈ ‘జిన్’ కథ గురించి చెప్పారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా అని నిర్మించేందుకు ముందుకు వచ్చాను. కర్ణాటక, ఆంధ్రా బార్డర్‌లో షూట్ చేసిన ‘జిన్’.. డిఫరెంట్ కంటెంట్, న్యూ కాన్సెప్ట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. అందరినీ భయపెట్టేలా ఉంటుంది’ అని తెలిపారు.

Next Story