వై.వి.ఎస్ చౌదరి- తారక రామారావు సినిమా స్టార్ట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-12 06:13:19  IST  )

నందమూరి హరికృష్ణ(Harikrishna) మనవడు, జానకిరామ్(Janaki Ram) కుమారుడు, తారక రామారావు(Taraka Rama Rao) హీరోగా వైవిఎస్ చౌదరి(YVS Chowdary) దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

వై.వి.ఎస్ చౌదరి- తారక రామారావు సినిమా స్టార్ట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి హరికృష్ణ(Harikrishna) మనవడు, జానకిరామ్(Janaki Ram) కుమారుడు, తారక రామారావు(Taraka Rama Rao) హీరోగా వైవిఎస్ చౌదరి(YVS Chowdary) దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీత(Geetha) నిర్మిస్తోంది. ఎన్టీఆర్ సరసన వీణారావు(Veenah Rao) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ బ్యూటీ తెలుగమ్మాయే కావడం విశేషం. ఇక ఈ మూవీ 1980 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తుండగా.. చంద్రబోస్(Chandra Bose) సాహిత్యాలను అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సీనియర్ ఎన్టీఆర్(Senior NTR) నటించిన ‘తోడు నీడ’(Thodu Needa) సినిమా రిలీజ్ అయి నేటితో 60 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమంతో పాటు షూటింగ్ కూడా స్టార్ కానుంది. ఇక ఈ విషయాన్ని మూవీ టీమ్ వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ఐకానిక్ లాంచ్‌కి సమయం ఆసన్నమైంది.. న్యూ టలెంట్ రోర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 యొక్క గ్రాండ్ ముహూర్తం షూటింగ్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.. ఎప్పటికీ ఉత్సాహవంతుడైన మరియు డైనమిక్ డైరెక్టర్ అయిన వైవిఎస్ చౌదరి’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story