అఖిల్- జైనాబ్ రిసెప్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యువసామ్రాట్ చై&శోభితా.. ఆకట్టుకుంటోన్న పోస్ట్

by Kodari Anjali |

టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తన చిరకాల ప్రేయసి జైనాబ్‌ను హైదరాబాద్లో హిందూ వేడుకలో వివాహం చేసుకున్నాడు.

అఖిల్- జైనాబ్ రిసెప్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యువసామ్రాట్ చై&శోభితా.. ఆకట్టుకుంటోన్న పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తన చిరకాల ప్రేయసి జైనాబ్‌ను హైదరాబాద్లో హిందూ వేడుకలో వివాహం చేసుకున్నాడు. జైనాబ్.. సౌదీకి చెందిన వ్యాపారవేత్త జుల్ఫీ రాష్ట్ర కుమార్తె అన్న విషయం తెలిసిందే. అఖిల్ అండ్ జైనాబ్ జూన్ 6 వ తారీకున ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం జూబ్లిహిల్స్ లోకి నాగార్జున నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

దీంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు అఖిల్ పెళ్లికి హాజరై సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే వీరిద్దరు గత ఏడాదే నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ విషయాన్ని వీరు నవంబరు 26వ తేదీన అఖిల్తో పాటు తల్లి అమల అండ్ తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

అయితే తాజాగా అఖిల్ అండ్ జైనాబ్ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా హాజరై హైలెట్గా నిలిచారు. అలాగే అఖిల్ అన్న, వదిన కూడా ఈ రిసెప్షన్ వేడుకలో ఆకర్షణీయంగా నిలిచారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ వీరి ఫొటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘అఖిల్ జైనాబ్ రిసెప్షన్‌లో యువసామ్రాట్ చై అక్కినేని & శోభితా ధూళిపాళ్ల చక్కగా ఉన్నారని, రిసెప్షన్ వేడకలో ఆకర్షణీయంగా నిలిచారని చెప్పుకొచ్చారు.

Next Story