- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైట్ వైట్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్న యుక్తి తరేజా
వైట్ టైట్ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న యుక్తి తరేజా

దిశ, వెబ్ డెస్క్: తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మోడల్, నటి యుక్తి తరేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె 2000 జనవరి 6న హర్యానా రాష్ట్రంలోని కైతాల్ జిల్లాలో జన్మించింది.
డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘రంగబలి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ‘మార్కో’ అనే మలయాళ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం యుక్తి పలు చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. సినిమాల్లో తన గ్లామర్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో సందడి చేస్తోంది.
తాజాగా వైట్ కలర్ టైట్ డ్రెస్‌లో కనిపించిన యుక్తి, తన నడుమందాలు హైలెట్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోల్లో ఆమె రింగుల జుట్టును ముఖం ఇరువైపులా పడేలా స్టైల్ చేసుకుంది. మెడలో చిన్న చైన్ ధరించి, క్యూట్ స్మైల్‌తో కెమెరాకు స్టిల్స్ ఇచ్చింది.
అలాగే నడుముకు వేసుకున్న చిన్న చైన్ ఆమె లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. మొత్తంగా ఈ ఫోటోల్లో యుక్తి హాట్ స్టిల్స్ హైలెట్ కావడంతో ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






