యువతి ప్రాణం తీసిన తప్పుడు కథనాలు.. పరారీలో యూట్యూబర్ వేదాంత్ జాక్సన్

by Ajay Maddhiboyina |

ఓ యూట్యూబర్ వ్యూస్ కోసం చేసిన తప్పుడు కథనాలు యువతి ప్రాణం తీశాయి. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇటీవల హైదరాబాద్ లోని పోచారం ఐడీ కారిడార్ పరిధిలో ఓ యువతికి బావ వరస అయ్యే వ్యక్తి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన సంగతి తెలిసిందే.

యువతి ప్రాణం తీసిన తప్పుడు కథనాలు.. పరారీలో యూట్యూబర్ వేదాంత్ జాక్సన్
X

దిశ, వెబ్ డెస్క్: ఓ యూట్యూబర్ వ్యూస్ కోసం చేసిన తప్పుడు కథనాలు యువతి ప్రాణం తీశాయి. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇటీవల హైదరాబాద్ లోని పోచారం ఐడీ కారిడార్ పరిధిలో ఓ యువతికి బావ వరస అయ్యే వ్యక్తి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన సంగతి తెలిసిందే. తాను ఎయిడ్స్ పేషంట్ కావడంతో యువతి పెళ్లికి నిరాకరిస్తోందని నింధితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాగా ఆ యువతి తీవ్రమనోవేదనతో ఏప్రిల్ 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్యకు ముందు యువతి తీసిన సెల్ఫీవీడియోలో తన చావుకు కారణం వేదాంత్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ అని చెప్పింది.

తన క్యారెక్టర్ ను తప్పుగా చూపే విధంగా ఆ ఛానల్ లో మీడియో చేశారని, వీడియోకు వచ్చిన కామెంట్స్ తో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని తెలిపింది. దీంతో యువతి సెల్ఫీమీడియా ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్ వేదాంత్ జాక్సన్ ను విచారణకు పిలిచారు. దీంతో యూట్యూబర్ వేదాంత్ ఆ వీడియో డిలీట్ చేసి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వేదాంత్ ఒక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉండేవాడు. డైలాగులు చెప్ప‌డం, సినిమా పాట‌ల‌కు ఎక్స్ ప్రెష‌న్స్ ఇవ్వ‌డం లాంటి వీడియోలు చేసేవాడు. ఆ త‌ర‌వాత యూట్యూబ్ లో వేదాన్ మీడియా అంటూ ఏకంగా ఓ ఛాన‌ల్ క్రియేట్ చేసి అందులో ర‌క‌ర‌కాల వీడియోలు చేస్తున్నాడు. ఎక్కువగా క్రైమ్ వార్త‌ల‌పై జ‌నాలు ఆస‌క్తిచూప‌డంతో అలాంటి వీడియోలే చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో వ్యూస్ కోసం కాస్త రెచ్చ‌పోతూ వీడియోలు చేయ‌డ‌మే ఇప్పుడు అత‌డిపై కేసులకు కార‌ణ‌మైంది.

Next Story