- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'యూత్' పోస్ట్‌పోన్.. కొత్త విడుదల తేదీ అదే?
'యూత్' విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ మార్చ్ 27.

దిశ, సినిమా: యువ నటుడు, దర్శకుడు కెన్ కరుణాస్ నటించి దర్శకత్వం వహించిన 'యూత్' చిత్రాన్ని మొదట మార్చి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను జోరుగా నిర్వహించారు. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాపై ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో మూవీ టీమ్ సక్సెస్ అయింది.
అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీలో మార్పు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన మార్చి 26 తేదీకి బదులుగా మార్చి 27న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో సూరజ్ వెంకటరాముడు, అనీష్మా అనిల్ కుమార్, మీనాక్షి దినేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.






