Riya Shibu: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న పాన్ ఇండియా యంగ్ ప్రొడ్యూసర్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

by Chukka Sudharani |

చియాన్ విక్రమ్ ఈ ఏడాది ‘వీర ధీర సూరన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Riya Shibu: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న పాన్ ఇండియా యంగ్ ప్రొడ్యూసర్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: చియాన్ విక్రమ్ ఈ ఏడాది ‘వీర ధీర సూరన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి అరుణ్ కుమార్ దర్శకత్వ వహించగా.. హెచ్.ఆర్. పిక్చర్స్ పతాకంపై హెచ్.ఆర్. రియా షిబు నిర్మించింది. ఇండస్ట్రీలోనే యంగ్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన రియా షిబు ఈ పాన్ ఇండియా మూవీతో 20 ఏళ్ల వయస్సుల్లోనే భారీ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయింది.

మలయాళ యంగ్‌స్టర్ నవీన్ పౌలీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్వం మాయ’. ఈ మలయాళ చిత్రానికి అఖిల్ సత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ 2025 క్రిస్మస్ స్పెషల్‌గా వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో హీరోయిన్‌గా ఇప్పటికే ప్రీతి ముఖుందన్ ఫిక్స్ కాగా.. రీసెంట్‌గా యంగ్ ప్రొడ్యూసర్ రియా షిబు కూడా ఇందులో జాయిన్ అయింది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ హీరోయిన్ ఎంట్రీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లింక్

Next Story