- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ హీరోయిన్ స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన యువకులు.. ప్రశాంతతను చెడగొడతారంటూ నటి ఫైర్
సినీ సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా నెటిజన్లు మీద మీద పడిపోతూ వారితో సెల్ఫీ దిగేందుకు ఎగబడుతుంటారు.

దిశ, సినిమా: సినీ సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా నెటిజన్లు మీద మీద పడిపోతూ వారితో సెల్ఫీ దిగేందుకు ఎగబడుతుంటారు. అయితే ఇటీవల అత్యంత ప్రతిష్ఠాత్యకం ప్రదేశం కుంభమేళాకు వెళ్లిన చాలామంది సినీ స్టార్స్‌తో ఎంతోమంది ఫొటోలు తీసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా చాలామంది సినీ సెలబ్రిటీలు కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. అంతేకాకుండా అక్కడ పలు ప్రత్యేక పూజలు చేసి తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. ఇక ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్(Katrina Kaif) కూడా కుంభమేళాలో పవిత్రస్నానం ఆచరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే.. ఎంతోమంది ఆమెను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసిన కత్రినా కైఫ్ కనిపిస్తుంది. అయితే ప్రత్యేకంగా ఆమె స్నానం చేస్తున్న వీడియోను నెట్టింట షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. కత్రినా అభిమానులు ఆమె కూడా మనిషే అలా వేధించడం తప్పు అని మండిపడుతున్నారు. దీనిపై తాజాగా, రవీనా టాండన్(Raveena Tandon) రియాక్ట్ అయింది. ‘‘ఇది చాలా అసహ్యంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా చేసుకునే పనుల్ని ఇలాంటి జనాలు చెడగొడుతుంటారు. ఇదేమి సరదాగా లేదు’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు రవీనాకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.






