- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
800 రూబిక్స్ క్యూబ్‌లను ఉపయోగించి సమంత ఫొటోను క్రియేట్ చేసిన యువకుడు.. నిజంగా అమేజింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా సినీ సెలబ్రిటీలకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారన్న విషయం తెలిసిందే. నటీనటుల్ని ఎంతగానో అభిమానించే వారు, వారి సినిమాలు, కార్యక్రమాలను తప్పకుండా చూసేవారు.. ఆ నటుడి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తి చూపేవారిని డైహార్ట్ ఫ్యాన్స్ అంటారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద స్టార్ హీరో, హీరోయిన్స్‌కి గుడులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సందీప్ అనే వ్యక్తి సమంతకి గుడి కట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన కార్ డ్రైవర్ సందీప్ సమంతకు వీర అభిమాని కాగా, ఆమెపై అతనికి ఉన్న అభిమానం గుడి రూపంలో చూపించాడు.
ఆ గుడిని సమంత పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారని, అనాథ పిల్లలకు సహాయం కూడా చేశారని ఆ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సమంతకు గుడి కట్టిన విషయంపై ఆమె స్పందిస్తూ ‘నేను అభిమానుల ప్రేమని చూసి సంతోషిస్తున్నాను. కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సరికాదు’ అని చెప్పినట్లు చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా indiancubeartist అనే ఐడీతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్‌లో సమంత ఫొటోను రూబిక్స్ క్యూబ్‌లను ఉపయోగించి తయారు చేసిన వీడియో పంచుకున్నారు. దీన్ని 800 రూబిక్స్ క్యూబ్‌లను ఉపయోగిస్తున్న ఓ యువకుడు క్రియేట్ చేశాడం విశేషం. ఇది వీక్షించిన సమంత ‘ఇది పూర్తిగా పిచ్చి.. కానీ ధన్యవాదాలు’ అని స్పందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నిజంగా అమేజింగ్ అంటూ ఫిదా అవుతున్నారు. instagram link






