- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమోషన్స్ మోడ్ ఆన్ అంటూ రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేసిన యంగ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక మోహనన్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. వెరైటీ వెరైటీ డ్రెస్సులతో నానా హంగామా చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
అందులో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో హెయిర్ లీవ్ చేసుకుని, పెద్ద పెద్ద నల్ల ఇయర్ రింగ్స్ పెట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ఇక వీటికి.. ‘హలో హైదరాబాద్.. ప్రమోషన్స్ మోడ్ ఆన్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సో ప్రెట్టీ, గార్జియస్, స్టన్నింగ్, కిర్రాక్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్నదాని పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






