పెళ్లి కాకుండానే సెవెంత్ యానివర్సరీ అంటూ ఆ ఫొటో షేర్ చేసిన యంగ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by I. Sairam |

యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పెళ్లి కాకుండానే సెవెంత్ యానివర్సరీ అంటూ ఆ ఫొటో షేర్ చేసిన యంగ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’(Software Devoloper) వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీకి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అలా ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) సరసన ‘బేబీ’(Baby) మూవీలో నటించి తన యాక్టింగ్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఇక రీసెంట్‌గా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘జాక్’(Jack) మూవీలో నటించింది.

ఇక ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ అయి ఓకే ఓకే అనిపించుకుంది. అయితే వైష్ణవి చైతన్య సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ఓ గిఫ్ట్ హ్యాంపర్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘కంగ్రాట్యులేషన్స్ హ్యాపీ మొబైల్స్ ఫర్ సెవెంత్ యానివర్సరీ’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.




Next Story