MamithaBaiju: మనకు దక్కాల్సినవి సరైన సమయం వచ్చినప్పుడే దక్కుతాయి.. యంగ్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్

by Chukka Sudharani |

తన సినీ కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకుంది మమితా బైజు.

MamithaBaiju: మనకు దక్కాల్సినవి సరైన సమయం వచ్చినప్పుడే దక్కుతాయి.. యంగ్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు.. ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ఆఫర్స్ అందుకుంటూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఆమె నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఒకటి. కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య, సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్టు సంబంధించిన షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతున్నది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది మమిత. ‘విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు బలమైన ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది ఒక సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా రూపొందగా.. ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో ఎగ్జైట్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. నన్ను నమ్మండి.. ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది’ అని తెలిపింది. అలాగే తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ‘నేను మలయాళ చిత్రసీమలో నా ప్రయాణాన్ని ఒక సహాయ నటిగా ప్రారంభించాను. ఇప్పుడు ప్రధాన పాత్రల వైపు అడుగులు వేస్తున్నాను. ప్రతి విషయాన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్లడాన్ని నేను విశ్వసిస్తాను.. ఎందుకంటే మనకు దక్కాల్సినవి సరైన సమయానికి తప్పక మనల్ని చేరుతాయి’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మమిత.

Next Story