24 ఏళ్లకే పెళ్లి.. ఆ కాన్ఫిడెన్స్‌తోనే చేసుకున్నా అంటున్న యంగ్ హీరోయిన్

by Chukka Sudharani |

‘బస్ స్టాప్(Bus stop)’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ ఆనంది (Anandhi).

24 ఏళ్లకే పెళ్లి.. ఆ కాన్ఫిడెన్స్‌తోనే చేసుకున్నా అంటున్న యంగ్ హీరోయిన్
X

దిశ, సినిమా: ‘బస్ స్టాప్(Bus stop)’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ ఆనంది (Anandhi). ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉంటూ వరుస సినిమాలు ప్రకటిస్తుంది. అదే విధంగా తెలుగులో ‘గరివిడి లక్ష్మి (Garividi Lakshmi)’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు అరేబియా కడలి (Arabian Kadali) అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వేదికగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సత్యదేవ్ (Sathyadev) హీరోగా నటించి ఈ మూవీ ఆగస్టు 8న రిలీజైంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంది తన సినిమా కెరీర్‌పై, మ్యారేజ్ లైఫ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఒక తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అనే ప్రశ్న ఎదురుకాగా.. ‘నేను ఏది ప్లాన్‌గా చేయలేదు. ఒక యాక్టర్‌గా నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను. సినీ కెరీర్ తెలుగు నుంచే స్టార్ట్ చేశాను. కానీ తమిళంలో మంచి క్యారెక్టర్స్ రావడం, అలాగే అప్పుడు నేను చదుకుంటున్నాను. చదువుతో పాటు సినిమాలు బ్యాలెన్స్ చేయాలంటే నాకు ఇక్కడ కొంచెం ప్రైవసీ కావాలి అనిపించి.. తెలుగులో బ్రేక్ తీసుకున్నాను. అందుకే తమిళంలో ఎక్కువ మూవీస్ చేశాను. ఇప్పుడు నేను తెలుగులోకి కమ్‌బ్యాక్ ఇచ్చాను. తమిళంలో నేను చేసిన మంచి మూవీస్ ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ రావడానికి ఉపయోగపడుతున్నాయి’ అని తెలిపింది. అలాగే ఎర్లీ ఏజ్‌లో పెళ్లి చేసుకోవడంపై స్పందిస్తూ.. ‘నాకు పెళ్లి అయితే.. సినీ కెరీర్‌కు బ్రేక్ పడద్ది అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు టాలెంట్ ఉంది కాబట్టి ఆఫర్స్ కచ్చితంగా వస్తాయి అని నమ్మాను. ఆ కాన్ఫిడెన్స్‌తోనే 24 ఏళ్లకే నేను పెళ్లి చేసుకున్నాను.. దాని గురించి నేను ఎప్పుడు బాధ పడలేదు’ అని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.

Next Story