- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాములు పట్టుకునేందుకు సిద్ధమైన యంగ్ హీరో.. ఒక్క పోస్ట్‌తో నెటిజన్లు షాక్!
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) ‘లవ్ ఆజ్ కల్’ సినిమాతో హీరోగా మారాడు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) ‘లవ్ ఆజ్ కల్’ సినిమాతో హీరోగా మారాడు. ఎలాంటి బ్యాగ్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన టాలెంట్‌తో హీరోగా రాణిస్తున్నాడు. పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక గత ఏడాది చందూ చాంపీయన్(Chandu Champion), భూల్ భూలయ్యా-3 (Bhool Bhoolaiyaa-3)వంటి సినిమాలతో వచ్చారు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ ‘అషికి-3’ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, కార్తీక్ ఆర్యన్ పాములు పట్టే వ్యక్తిగా మారబోతున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే.. కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్. ఇక దీనిని ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మంచబోతుండగా.. ఈ చిత్రానికి ‘నాగరాజ్’ అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కార్తీక్ ఆర్యన్య పాములు పట్టే వ్యక్తిగా నటించబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కార్తీక్ ఆర్యన్ పాముతో పోరాడినట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజమే కానీ పాక్షికంగా మాత్రమే. ఈ చిత్రంలో పాములతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అవి చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
#EXCLUSIVE: Kartik Aaryan Starrer Karan Johar Film Titled NAAGRAAJ, Kartik To Play A Snake – Man!https://t.co/G70mLefTDx#kartikaaryan #karanjohar #naagraaj @TheAaryanKartik @DharmaMovies
— Box Office Worldwide (@BOWorldwide) April 10, 2025






