మరో కొత్త మూవీతో వస్తున్న యంగ్ హీరో.. ఆ స్టార్ డైరెక్టర్ చేతులమీదుగా టైటిల్& గ్లింప్స్ లాంచ్.. హైప్ పెంచేస్తున్న పోస్టర్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-02 06:32:26  IST  )

టాలీవుడ్ ప్రొడ్యూసర్ SKN రీసెంట్‌గా ఓ సినిమా అప్‌డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరో కొత్త మూవీతో వస్తున్న యంగ్ హీరో..  ఆ స్టార్ డైరెక్టర్ చేతులమీదుగా టైటిల్& గ్లింప్స్ లాంచ్.. హైప్ పెంచేస్తున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రొడ్యూసర్ SKN రీసెంట్‌గా ఓ సినిమా అప్‌డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘కలర్ ఫోటో, బేబీ’ సినిమాలతో కల్ట్ బ్లాక్‌బస్టర్స్ (Cult blockbusters) అందుకున్న మేకర్స్ నుంచి ఈ మూవీ రాబోతుంది అని.. ఇక దీనికి మణిశర్మ(manisharma) మ్యూజికల్ మ్యాజిక్‌ను అందించబోతున్నారని.. ఈ సోమవారం, జూన్ 2న సాయంత్రం 5:04 గంటలకు టైటిల్ & గ్లింప్స్ విడుదల చేయబోతున్నాం అని ఎక్స్ వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో అప్డేట్ ఇచ్చారు.

ఇందులో భాగంగా ఈ మూవీ టైటిల్ అండ్ గ్లింప్స్‌ను మన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా లాంచ్ చేపిస్తున్నట్లు తాజాగా మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఓ మేరకు ఓ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)కు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘ఆత్మను కదిలించే ప్రేమకథ, దానిలో లోతుగా వెళ్ళడానికి ధైర్యం చేస్తుంది.. తీవ్రమైన భావోద్వేగం మరియు మరపురాని కథ చెప్పే మాస్టర్ అయిన సందీప్ రెడ్డి వంగా ద్వారా ప్రారంభించబడింది.. టైటిల్ & గ్లింప్స్ ఈరోజు సాయంత్రం 5:35 గంటలకు విడుదల కానున్నాయి’ అని రాసుకొచ్చాడు. దీంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది. కాగా ఈ మూవీలో హీరోగా కిరణ్ అబ్బవరం, హీరోయిన్‌గా శ్రీ గౌరి ప్రియలు నటిస్తున్నారు.

Next Story