- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేం ఎన్ని సినిమాలు తీసినా అది రవితేజ భిక్షే.. యంగ్ డైరెక్టర్స్ ఎమోషనల్
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. కాగా ఈ వేడుకలో రవితేజతో సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్స్ బాబి, హరీష్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ.. మా లాంటి డైరెక్టర్లు ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు తీసినా అది రవితేజ పెట్టిన భిక్షనే అని అన్నారు. రవితేజ లాంటి నటుడు ఇండస్ట్రీకి కచ్చితంగా ఉండాలన్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న తమను డైరెక్టర్లుగా మార్చాడన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ.. మిరపకాయ్ సినిమా ఇచ్చినా, మిస్టర్ బచ్చన్ ఇచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి రవితేజ అని కొనియాడారు. మాస్ మహరాజ్ టైటిల్ తీసేశారని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయని కానీ ఆ పేరు పెట్టిందే తానని చెప్పాడు. ఆ పేరు పేటెంట్ రైట్స్ తన వద్దనే ఉన్నాయని, తీసేయాలంటే తనని అడగాలని చెప్పాడు. తనకు డైరెక్టర్ గా జన్మ, పునజ్జన్మ ఇచ్చింది రవితేజనే అని అన్నాడు. మళ్లీ బ్లాక్ బస్టర్ బొమ్మ తీస్తామని దీమా వ్యక్తం చేశాడు.






